Ad Code

ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక


కేవైసీ అప్‌డేట్‌ పేరు మీద +91-8294710946 & +91-7362951973 నంబర్ల నుంచి ఖాతాదారులకు కాల్స్‌, మెసేజ్స్‌ వస్తున్నాయని ఎస్బీఐ గుర్తించింది. ఈ ఫోన్‌ నెంబర్ల నుంచి కాల్స్‌, మెసేజ్ లు, లింకుల పట్ల జాగ్రత్త వహించాలని ఖాతాదారులకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు స్పందించవద్దంది. లింక్స్ ను క్లిక్ చేయకూడదంది. అలాగే ఈ నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లను కూడా ఓపెన్‌ చేయకూడదని విన్నవించింది. ఈ నెంబర్ల ద్వారా కేటుగాళ్లు కస్టమర్ల అకౌంట్ల నుంచి డబ్బు కొట్టేస్తారని ఎస్బీఐ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా కస్టమర్ల డబ్బులను కేటుగాళ్లు కొట్టేస్తున్న విషయాన్ని అసోం సీఐడీ అధికారులు గుర్తించా ట్విట్టర్ లో అలర్ట్ చేయగా, ఎస్బీఐ రీట్వీట్ చేసింది. అంతేకాకుండా ఖాతాదారులు తమ అకౌంట్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుకు సంబంధించిన విషయాలను ఎవరితో పంచుకోవద్దని, గోప్యంగా ఉంచాలని తెలియజేసింది. 

Post a Comment

0 Comments

Close Menu