Ad Code

ట్విట్టర్‌లో ఎడిట్‌ బటన్‌ ?


ట్విట్టర్‌కు భారతదేశంలో దాదాపు 1.75 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇది దేశ జనాభాలో ఒక శాతం కంటే తక్కువగా ఉండవచ్చు. లింక్డ్‌ఇన్, ఫేస్‌బుక్‌తో పోలిస్తే ట్విట్టర్‌ ప్రభావవంతమైనది. వాస్తవానికి ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుంచి అధికారిక సమాచారం ముందుగా ట్వీట్ ద్వారానే బయటకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తా సంస్థలు రోజూ ముఖ్యమైన వ్యక్తుల ట్వీట్లను ముఖ్యాంశాలుగా మారుస్తున్నాయి. ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే ట్విట్టర్‌కు అధిక విశ్వసనీయత ఉంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైనప్పుడల్లా తమ మాటలను వెనక్కి తీసుకుంటారనేది తెలిసిందే. ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ లేకపోవడంతో రాజకీయ నాయకులు కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కొనేవారు. దీనివల్ల శక్తివంతమైన వ్యక్తుల పాత ట్వీట్‌లను తిరిగి కనుగొని, వారిని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎడిట్ ట్వీట్ బటన్ లేకపోతే గతంలో ట్విటర్‌లో రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలను ఆధారంగా చేసుకొని నిలదీసే అవకాశం ఉంటుంది. కనీసం ఆ వ్యక్తి గతంలో ఏం మాట్లాడినా దానికి సంబంధించిన పబ్లిక్ డిజిటల్ రికార్డ్‌ అందుబాటులో ఉంటుంది. దీంతో సంబంధిత నేత మోసపూరిత ప్రసంగాలను బయటపెట్టవచ్చు. ట్విట్టర్‌లో ఎడిట్ బటన్‌తో పెద్దగా ఏమీ మారదని వాదించవచ్చు. ఆ వాదన నిజమే కూడా కావచ్చు. ఎడిట్ బటన్ పరిస్థితులను పెద్దగా మార్చదు. రాజకీయ నాయకులు, శక్తివంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంటారు. కానీ పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ట్వీట్‌ను ఎడిట్ చేసిన తర్వాత రీట్వీట్‌లు, కోట్‌లు, లైక్స్‌కు ఏం జరుగుతుంది? ఎడిట్‌ బటన్ మీ అక్షరదోషాలను సరిదిద్దడానికి మాత్రమే పరిమితం కాదు. దానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ట్వీట్‌ను ఎడిట్ చేసినప్పుడు లైక్స్‌, రీట్వీట్‌లు ఏమవుతాయనేది పెద్ద ప్రశ్న. ట్విట్టర్‌లో ఎడిట్ బటన్‌ను జోడించినట్లయితే.. ఫీచర్ ఆటోమేటిక్‌గా అన్ని రీట్వీట్‌లు, లైక్స్‌ను రద్దు చేసి, తాజా ట్వీట్‌గా కనిపించేలా చేస్తుంది. ట్వీట్‌పై ఎడిట్ ట్యాగ్‌ను జోడించడం ద్వారా వినియోగదారులు కొత్తగా ట్వీట్‌ చేసేందుకు ట్విట్టర్‌ అనుమతించదు. జనాదరణ పొందిన అభిప్రాయాన్ని సవరించి పంచుకోవడం ద్వారా ఇతర వినియోగదారుల నుంచి మద్దతును (లైక్స్‌, రీట్వీట్‌ల ద్వారా) పొందేందుకు అనుమతి లేదు. ఇప్పుడు 'ట్వీట్లు, రీట్వీట్లు' కౌంటర్ రీసెట్ అయితే.. ట్వీట్‌ను ఎడిట్ చేయడం కొత్త ట్వీట్‌ను పోస్ట్ చేయడం మధ్య ఎటువంటి తేడా ఉండదు. ట్వీట్‌ని సవరించడానికి ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. అయితే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు వందల కొద్దీ రీట్వీట్‌లు, లైక్‌లను సంపాదించడానికి ఐదు నిమిషాలు సరిపోతుంది. ఆ సమయంలో.. నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ధృవీకరించబడిన హ్యాండిల్స్‌లో ఎడిట్ బటన్‌ను పొందకుండా చేసే అవకాశాన్ని ట్విట్టర్‌ పరిశీలించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu