Ad Code

వివో ప్యాడ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ !


ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో  బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు బెస్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నుంచి మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్  లాంచ్ అయ్యింది. వివో ప్యాడ్ పేరుతో దీనిని మంగళవారం రోజు మార్కెట్లోకి తీసుకొచ్చింది కంపెనీ. నిన్న చైనాలో జరిగిన ఈవెంట్ లో వివో ఎక్స్ ఫోల్డ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వివో ప్యాడ్ ని కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ వివో ప్యాడ్ హై-ఎండ్ స్పెసిఫికేషన్లతో ప్రీమియం టాబ్లెట్‌ల లిస్టులోకి చేరిపోయింది.  వివో ప్యాడ్ 8జీబీ + 128జీబీ మోడల్ ధర 2,499 చైనీస్ యువాన్ల (దాదాపు రూ. 29,800) నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధరని 2,999 (దాదాపు రూ. 35,700) చైనీస్ యువాన్లుగా నిర్ణయించారు. యూజర్లు వివో ప్యాడ్ స్టైలస్ (Stylus), ఎక్స్‌టర్నల్ మ్యాగ్నెటిక్ కీబోర్డ్ వంటి యాక్సెసరీస్ లు విడిగా తీసుకోవచ్చు. వివో ఆండ్రాయిడ్ టాబ్లెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేసే 11-అంగుళాల WQXGA డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే HDR10, డాల్బీ విజన్ కి సపోర్ట్‌ చేస్తుంది. ఇది 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను ఆఫర్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఇది గరిష్టంగా 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. అయితే దీని మెమరీ ఎక్స్‌పాండ్ చేయడం కుదరదు. ఇందులో డాల్బీ అట్మోస్ అందించిన క్వాడ్ స్పీకర్లు ఉంటాయి కానీ మీకు ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లభించదు. వినియోగదారులు దీనిని గుర్తుంచుకోవాలి. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లో f/2.2 ఎపర్చరు గల 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ అందించారు. టాబ్లెట్ ముందు భాగంలో వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అమర్చారు. వెనుక కెమెరా సాయంతో మీరు 4K వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

వివో ప్యాడ్ చైనాలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఆండ్రాయిడ్ 11-ఆధారిత ఆరిజిన్ ఓఎస్ (OriginOS) ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. దీనికి ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ ఈ ఏడాదిలోనే అందే అవకాశం ఉంది. వివో ప్యాడ్ లో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, USB టైప్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 8,040ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం వివో, రియల్‌మీ, షియోమీ, వన్‌ప్లస్ బ్రాండ్స్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను తీసుకు వచ్చినట్లుగా బెస్ట్ టాబ్లెట్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. టాబ్లెట్ ప్రియులకు ఇదొక గుడ్ న్యూస్ చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో ఈ చైనీస్ బ్రాండ్ల నుంచి ఎలాంటి బెస్ట్ టాబ్లెట్లు రిలీజ్ అవుతాయో చూడాలి.

Post a Comment

0 Comments

Close Menu