ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో అవసరం కోసం ప్రియుడికి ఇచ్చిన బంగారం తిరిగి ఇవ్వలేదని ఓ యవతి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూల్‌కు చెందిన ప్రేమ్ కుమార్, మనోహరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రేమ్ కుమార్ అనారోగ్యంతో మరణించగా, మనోహరి హోంగార్డుగా విధులు నిర్వహిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె దీపిక కడపలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన సంజయ్‌తో దీపికకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇటీవల దీపిక ఇంటికి వెళ్లగా తనకు డబ్బు అవసరం ఉందని సంజయ్ ఆమెకు చెప్పాడు. దీంతో దీపిక తన సోదరి బంగారు గొలుసు, ఉంగరం తీసుకువచ్చి అతడికి ఇవ్వడంతో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇటీవల దీపిక అక్క పెళ్లి కుదరడంతో ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ప్రియుడిని కోరింది. పలుమార్లు బంగారం విడిపించి ఇవ్వాలని కోరినా అతడు మాట దాట వేస్తూ నిర్లక్ష్యం చేశాడు. సోదరి పెళ్లి దగ్గరపడటంతో తల్లి బంగారం తీసుకురావాలని చెప్పగా ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
3
Beranda › Posts filed under Young woman dies by suicide after boyfriend fails to return gold she gave him
Showing posts with label Young woman dies by suicide after boyfriend fails to return gold she gave him. Show all posts
Showing posts with label Young woman dies by suicide after boyfriend fails to return gold she gave him. Show all posts
Subscribe to:
Posts (Atom)
