తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు గ్రామ శివారులో గుడిబండ గ్రామానికి చెందిన షేక్ నాగుల్ (14) తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనం పై సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో కోదాడ నుంచి మేళ్లచెరువు వైపు వెళ్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
3
Beranda › Posts filed under outskirts of Adluru village
Showing posts with label outskirts of Adluru village. Show all posts
Showing posts with label outskirts of Adluru village. Show all posts
Subscribe to:
Posts (Atom)
