మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో నిర్వహించిన ఐదవ పద్మ మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో బుధవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదన్నారు. శక్తివంతమైన దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని, ఇతర దేశాలను తమ ఒత్తిడిలో ఉంచాలని చూస్తున్నాయని అన్నారు. అవి ‘బలవంతుడిదే రాజ్యం’ అనే సూత్రాన్ని నమ్ముతున్నాయని విమర్శించారు. అయితే భారత్ మాత్రం తన అభివృద్ధితో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల సంక్షేమాన్ని కూడా కోరుకుంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ శక్తులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మోహన్ భగవత్ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతుందని కొన్ని దేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ తనను వ్యతిరేకించే, ద్వేషించే పొరుగు దేశాలకు సైతం సహాయం చేయాలనే ఆలోచన కలిగి ఉందని చెప్పారు. దేశ యువతలో బానిసత్వ మనస్తత్వం తగ్గిపోయిందని, నిజం మాట్లాడేవారికి మద్దతుగా నిలబడేందుకు వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అబద్ధాలను వ్యతిరేకిస్తూ, దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష యువతలో పెరుగుతోందని వివరించారు. జ్ఞాన యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా హాజరయ్యారు. అయన మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఈ లక్ష్యానికి యువతే ప్రధాన భాగస్వాములని, భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఫలాలను అనుభవించేది కూడా వారేనని పేర్కొన్నారు. గతంలో సాధించిన విజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, దేశంలోని మేధోశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాల అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుత ప్రపంచ భద్రతా పరిస్థితులు సున్నితమైన దశలో ఉన్నాయని జనరల్ అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా అధికార సమతుల్యత మారుతోందని, భారత్ శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కొన్ని దేశాలకు ఇష్టం లేకపోవచ్చని అన్నారు. అయితే దేశానికి ఎదురయ్యే బాహ్య ముప్పుల కంటే అంతర్గత ముప్పులే ఎక్కువ ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పరోక్షంగా సూచించారు.
3
Beranda › Posts filed under fifth ‘Padma Mahotsav’ held in Chhatrapati Sambhajinagar
Showing posts with label fifth ‘Padma Mahotsav’ held in Chhatrapati Sambhajinagar. Show all posts
Showing posts with label fifth ‘Padma Mahotsav’ held in Chhatrapati Sambhajinagar. Show all posts
Subscribe to:
Posts (Atom)
