భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కోసం వ్యామోగాముల శిక్షణ కొనసాగుతోంది. అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, సురక్షితంగా భూమికి తిరిగి రావడమే లక్ష్యంగా భారత వ్యోమగాములకు అత్యంత కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాలో జరుగుతున్న జీరో గ్రావిటీ ట్రైనింగ్ లో నలుగురు భారత ఆస్ట్రోనాట్స్ పాల్గొన్నారు. భూమిపై ఉంటూనే అంతరిక్షంలో బరువు లేని పరిస్థితిని అనుభవించారు. గాల్లో తేలుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఆనందంతో నవ్వుతున్న వారి దృశ్యాలు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత గగనయాన్ మిషన్కు ఎంపికైన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా రష్యాలోని ప్రత్యేక విమానం Il-76MDKలో ఈ శిక్షణ పొందారు.అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భూమి గురుత్వాకర్షణ ప్రభావం దాదాపుగా కనిపించని పరిస్థితుల్లో శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలి? ఎలా కదలాలి? వస్తువులను ఎలా పట్టుకోవాలి? అనే అంశాలపై వీరికి శిక్షణ ఇస్తున్నారు. భూమిపైన జీరో గ్రావిటీ పరిస్థితిని ఎలా సృష్టిస్తారంటే.. ఇందుకోసం సాధారణ విమాన ప్రయాణానికి భిన్నంగా ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తారు. విమానం దాదాపు 45 నుంచి 50 డిగ్రీల కోణంలో పైకి ఎగిరి.. ఆ తర్వాత పారాబొలిక్ ట్రాజెక్టరీలో ప్రయాణిస్తుంది. ఈ సమయంలో విమానం, అందులోని వ్యోమగాములు ఒకే విధంగా ఫ్రీ ఫాల్ పరిస్థితిలోకి వెళ్తారు. దీంతో దాదాపు 25 నుంచి 30 సెకన్ల పాటు బరువు లేని అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో వ్యోమగాములు గాల్లో తేలుతూ.. శరీర కదలికలను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత విమానం తిరిగి సాధారణ ప్రయాణ స్థితికి వస్తుంది.కేవలం జీరో గ్రావిటీ మాత్రమే కాదు.. చంద్రుడు, అంగారక గ్రహాలపై ఉండే గురుత్వాకర్షణ పరిస్థితులను కూడా ఈ శిక్షణలో అనుకరిస్తారు. భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి కేవలం 18 శాతం మాత్రమే ఉంటుంది. అదే అంగారకుడిపై దాదాపు 38 శాతం ఉంటుంది.ఈ పరిస్థితుల్లో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం.. నడవడం.. కదలికలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై వ్యోమగాములు అనుభవం సంపాదిస్తారు. ఈ శిక్షణకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంతరిక్షంలో అడుగుపెట్టాలనే కోట్లాది భారతీయుల కలను నిజం చేయడానికి సిద్ధమవుతున్న ఈ వ్యోమగాములు.. బరువు లేని స్థితిలో గాల్లో తేలుతూ చిన్నపిల్లల్లా ఆనందిస్తున్నారు.దేశం కోసం అత్యంత బాధ్యతాయుతమైన అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతున్న వీరి ముఖాల్లో కనిపిస్తున్న ఆ ఆనందం.. భారత అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న పురోగతికి ఒక అందమైన ప్రతిబింబంగా నిలుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ముగ్గురు వ్యోమగాములను భూమికి సమీప కక్ష్యలోకి పంపించి అక్కడ మూడు రోజుల పాటు అంతరిక్షంలో ఉంచి సురక్షితంగా భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మిషన్ విజయవంతమైతే సొంత సామర్థ్యంతో మానవులను అంతరిక్షంలోకి పంపిన దేశాల సరసన భారత్ నిలుస్తుంది. భవిష్యత్తులో భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం, చంద్రుడిపై మానవ యాత్రల దిశగా కూడా ఈ ప్రయోగం కీలకమైన పునాది కానుంది.
3
Beranda › Posts filed under Zero-Gravity Training in Russia
Showing posts with label Zero-Gravity Training in Russia. Show all posts
Showing posts with label Zero-Gravity Training in Russia. Show all posts
Subscribe to:
Posts (Atom)
