బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో కూడా వాతావరణం మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల ద్రోణి విస్తరించడం, అలాగే కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వైపు మరో ద్రోణి కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఈ రెండు రోజులకు రాష్ట్రంలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదు. నవంబర్ 26 నుంచి తెలంగాణలో తిరిగి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కోతకు వచ్చిన పంటలు, ఆరుబయట ఆరబెట్టిన ధాన్యాన్ని తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు నిదానంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 26 నుండి వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా పొడి, చల్లని పరిస్థితులు నెలకొంటాయి. ఇదిలా ఉంటే తెలంగాణా వ్యాప్తంగా చలి బాగా పెరిగింది. తెలంగాణాలో వాతావరణం చాలా వరకు పొడిగా ఉంటుంది, అక్కడక్కడా తక్కువ వర్షం పడే అవకాశం ఉంది. కేవలం పది శాతం మాత్రమే వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు29°C-30°Cమరియు తేలికపాటి తూర్పు గాలులు వీస్తాయి.
3
Beranda › Posts filed under Trough in the Bay of Bengal: Rain Forecast for Several Districts in Telangana
Showing posts with label Trough in the Bay of Bengal: Rain Forecast for Several Districts in Telangana. Show all posts
Showing posts with label Trough in the Bay of Bengal: Rain Forecast for Several Districts in Telangana. Show all posts
Subscribe to:
Posts (Atom)
