చిలగడ దుంపను ప్రతిరోజూ మన డైట్‌లో భాగం చేసుకో వడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ దుంపతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ దుంప తీసుకోవటంతో షుగరు, బీపీ నియంత్రణలో ఉండటంతో పాటుగా గుండెకు మేలు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. చాలామంది కాల్చిన చిలగడదుంప ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా, నిమ్మరసం చల్లుకుని తీసుకుంటారు. ఇలా తినడం ఈ సీజన్‌లో తీసుకోగలిగే ఉత్తమమైన ఆహారాల్లో ఒకటి. కాగా, ఈ దుంప ద్వారా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్-ఎ గా మారుతుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరచడానికి, వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను, రేచీకటిని నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్-సి మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తాయి. అదే విధంగా చిలగడదుంపల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించ డం లో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చిలగడదుంపలు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడానికి కారణం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే చిలగడదుంపలను అతిగా తినకూడదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకోవాలని వైద్యులు సూచించినవారు, సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
3
Beranda › Posts filed under Sweet Potato - Health Benefits
Showing posts with label Sweet Potato - Health Benefits. Show all posts
Showing posts with label Sweet Potato - Health Benefits. Show all posts
చిలగడదుంప - ఆరోగ్య ప్రయోజనాలు
చిలగడదుంపలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. చిలగడదుంపలో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య రాకుండా ఉండాలనుకునే వారు దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఉదయం పూట అల్పాహారం మానేసే వారికి మరియు కారంగా ఉండే ఆహారం ఎక్కువగా తినే వారికి కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి వారు చిలగడదుంపను తరచుగా తింటే, కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరంలోని కణాల నాశనాన్ని అడ్డుకుని, ఎల్లప్పుడూ ఉత్సాహంగా మరియు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ బి, సి మరియు ఇనుము వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. చిలగడదుంపలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు మరియు ప్రేగులలో పేరుకుపోయిన విషతుల్యాలను తొలగిస్తుంది. మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
Subscribe to:
Posts (Atom)
