About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label Pakistan’s Wing Commander Muhammad Zeeshan Ali. Show all posts
Showing posts with label Pakistan’s Wing Commander Muhammad Zeeshan Ali. Show all posts

తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టబోతున్న తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్తాన్ వింగ్ కమాండర్ మహమ్మద్ జీషాన్ అలీ

చైనా సొంతంగా నిర్మించిన తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టబోతోన్న తొలి విదేశీ వ్యోమగామి, నాన్ చైనీస్ పౌరుడిగా పాకిస్తాన్ వింగ్ కమాండర్ మహమ్మద్ జీషాన్ అలీ ఓ నూతన అధ్యాయానికి నాంది పలకనున్నాడు. చైనాకు చెందిన షెంజౌ 24 మానవ సహిత వ్యోమనౌక ద్వారా రోదసిలోకి అడుగుపెట్టనున్నాడు.. జీషాన్ అలీ. ఈ మిషన్‌లో పేలోడ్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఆయనతో పాటు మొత్తం ముగ్గురిని అంతరిక్షానికి ఎంపిక చేసింది చైనా. సీనియర్ వ్యోమగాములు టాంగ్ హాంగ్‌బో, వు యీ.. ఈ వ్యోమనౌకలో నింగిలోకి ప్రయాణించనున్నారు. పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ సుపార్కో, స్పేస్ సెంటర్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. స్పేస్, బయో టెక్నాలజీ, మెటీరియల్స్ రీసెర్చ్, ఫుడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై తియాంగ్యాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఈ ప్రయోగాలు జరుగనున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి చైనా స్పేస్ స్టేషన్ పాకిస్తాన్ లోని వివిధ యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 300కు పైగా ప్రతిపాదనలు చైనాకు అందాయి. వీటన్నింటినీ వడబోసి ఈ నాలుగు ప్రాజెక్టులను ఈ మిషన్ కోసం ఎంపిక చేసింది. జీషన్ అలీ, టాంగ్ హాంగ్ బో, వు యీ తో కూడిన ఈ వ్యోమనౌక.. వాయవ్య చైనాలోని జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బీజింగ్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:18 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. చైనా మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో ఒక విదేశీ వ్యోమగామి పాలుపంచుకోవడం ఇదే తొలిసారి. జీషాన్ అలీ తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలో దాదాపు వారం రోజుల పాటు గడపనున్నారు. అక్కడ పరిశోధనలు పూర్తి చేసుకున్న అనంతరం షెన్‌జౌ 23 ద్వారా భూమికి తిరిగి రానున్నారు. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా జీషాన్ అలీకి సుదీర్ఘ అనుభవం ఉంది. రోదసిలోకి వెళ్లడానికి చైనా స్పేస్ సెంటర్ లో శిక్షణ పొందారు. వ్యోమనౌక నిర్వహణ, అంతరిక్షంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను తట్టుకోవడం, జీరో గ్రావిటీ వాతావరణానికి అలవాటు పడటంతో పాటు తోటి వ్యోమగాములతో మాట్లాడటానికి చైనీస్ భాష మాండరిన్ ను కూడా ధారాళంగా మాట్లాడటం కూడా నేర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మిషన్ కోసం జీషాన్ తో పాటు పాకిస్తాన్ నుంచి ఖుర్రమ్ దావూద్‌ అనే వ్యోమగామిని కూడా సెలెక్ట్ చేసింది చైనా. తుది మిషన్ కోసం జీషాన్ అలీ వైపు మొగ్గు చూపింది. చైనా అంతర్జాతీయ స్థాయిలో తన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలను విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో దేశానికి చెందిన వ్యోమగామికి తమ స్పేస్ స్టేషన్‌లో అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.

Read More...