అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వ్యవస్థలే లక్ష్యంగా హ్యాకర్లు భారీ సైబర్ దాడికి పాల్పడినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ఈ సైబర్ దాడి ప్రభావం ఆయా సంస్థల నెట్‌వర్క్‌లపై పడినప్పటికీ, అత్యంత రహస్యమైన డేటాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అది పూర్తిగా సురక్షితంగానే ఉందని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సైబర్ దాడి వెనుక ఉన్న సాంకేతికతను విశ్లేషించిన అమెరికా సైబర్ భద్రతా నిపుణులు కీలక విషయాలను గుర్తించారు. ఈ దాడిని నిర్వహించడానికి హ్యాకర్లు ఒక అత్యాధునిక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయి. ఏఐ సాయంతో భద్రతా వలయాలను ఛేదించేందుకు హ్యాకర్లు ప్రయత్నించడం అమెరికా రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దాడి వెనుక చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న హ్యాకింగ్ గ్రూపుల ప్రమేయం ఉందా అనే కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ చేపట్టాయి.
3
Beranda › Posts filed under Massive cyberattack on America’s most critical intelligence agencies
Showing posts with label Massive cyberattack on America’s most critical intelligence agencies. Show all posts
Showing posts with label Massive cyberattack on America’s most critical intelligence agencies. Show all posts
Subscribe to:
Posts (Atom)
