యూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను ఐబిఎం కన్సల్టింగ్‌లోని చాలా ఉద్యోగాలకు నిలిపివేస్తోంది. దీంతో ఉద్యోగులు యూఎస్ విడిచి ఇతర దేశాల్లో ఉన్న ఐబిఎం ఆఫీసులకు వెళ్లాలి లేదా ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని విడిచి పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి యూనిట్ మేనేజర్లకు కంపెనీ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. “నైపుణ్యాల కొరతను పరిష్కరించడానికి ఐబిఎం కన్సల్టింగ్ యూఎస్ ఉన్నత-నైపుణ్య వీసా కార్యక్రమాలలో పాల్గొంటుంది,” అని ఐబిఎం ప్రతినిధి ఒకరు చెప్పారు. నైపుణ్యాల లభ్యత క్లయింట్ అవసరాలు మారినందున, ఐబిఎం కన్సల్టింగ్‌లోని అటువంటి చాలా ఉద్యోగాలకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేయాలని తాము నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం అంత సులభమైనది కాదన్నారు. కంపెనీ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు మూడు వారాల సమయం ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం తీసుకోని వారికి మూడు నెలల సెవరెన్స్ పేమెంట్ లభిస్తుంది. బయటకు వెళ్లేవారికి, రిజైన్ చేసేవారికి డిసెంబర్ 31 వారి చివరి పనిదినంగా ఉంటుంది. ఇండియాకి తిరిగి వెళ్లేవారికి జీతంలో దాదాపు 80 శాతం కోత పడొచ్చని ఒక ఐబీఎం ఉద్యోగి బ్లైండ్‌లో రాశారు.
3
Beranda › Posts filed under IBM Consulting Discontinues Green Card Sponsorship for Many Roles
Showing posts with label IBM Consulting Discontinues Green Card Sponsorship for Many Roles. Show all posts
Showing posts with label IBM Consulting Discontinues Green Card Sponsorship for Many Roles. Show all posts
Subscribe to:
Posts (Atom)
