తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని జోగిపేట బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ తక్షణమే ఈ ఘటనపై స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేద విద్యార్థినులకు పౌష్టిక ఆహారం అందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మాజీ చైర్మన్ మఠం భిక్షపతి మండిపడ్డారు. స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, నిర్లక్ష్యానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో భోజన నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, విద్యార్థినుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
3
Beranda › Posts filed under Andole constituency
Showing posts with label Andole constituency. Show all posts
Showing posts with label Andole constituency. Show all posts
Subscribe to:
Posts (Atom)
