పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ సేవలకు అంతరాయం !


మైక్రోసాఫ్ట్‌ సేవలకు పలు దేశాల్లో అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అవుట్‌లుక్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, అజ్యూర్‌, మైక్రోసాఫ్ట్‌ 365 వంటి సర్వీసులు డౌన్‌ కావడంతో సేవలు నిలిచిపోయాయి. భారత్‌ సహా యూఏఈ, బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవుట్‌ లుక్‌ రీఫ్రెష్‌ కావడం లేదని, మెయిల్స్‌ రావడం లేదని పలువురు యూజర్లు సోషల్‌ మీడియా ద్వారా కంప్లయింట్‌ చేస్తున్నారు. భారత్‌లో మాత్రం మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ విషయంలో యూజర్లు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. సేవలు నిలిచిపోవడంపై మైక్రోసాఫ్ట్‌ కంపెనీ స్పందించింది. సమస్య తలెత్తడానికి గల కారణాన్ని అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేస్తామని, తొందరలోనే సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. అయితే దీనివల్ల ఎంతమంది ఇబ్బందుల పడ్డారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org