హోండా యాక్టివా కొత్త మోడల్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఇది యాక్టివా లైట్ వెయిట్ మోడల్‌గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బేస్ మోడల్ DLX కంటే 1 కిలో బరువు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కంపెనీ ఈ లైట్ వెయిట్ వెర్షన్‌ను జనవరి 23న ప్రారంభించే అవకాశం ఉంది. ఈ బైక్ కు యాక్టివా స్మార్ట్ అని పేరు పెట్టారు. ఇది స్మార్ట్ బిట్‌తో రాబోతుంది. కొత్త యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ ని కలిగివుంటుందని కంపెనీ పేర్కొంది. దీని పవర్‌ట్రెయిన్ మిగిలిన మోడళ్ల కంటే శక్తివంతమైన ఇంజన్‌తో రానుంది. స్కూటర్ పొడవు 1833mm, వెడల్పు 697mm, ఎత్తు 1156mm, 1260mm వీల్‌బేస్ కలిగి ఉంటుంది. సైజులో కాస్త పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. హై-వోల్టేజ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్‌తో డిజైన్ కలిగి ఉండనుంది. ఇది సుదూర ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. 0.5 kWh బ్యాటరీ, స్టార్టర్ మోటార్/జనరేటర్‌తో, స్కూటర్ 40 kmph గరిష్ట వేగంతో దాదాపు 10 నుండి 15 కిమీల పయనిస్తుంది. యాక్టివా స్మార్ట్ కాకుండా, హోండా త్వరలో రెండు కొత్త కమ్యూటర్ స్కూటర్లను తీసుకునున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో రెండు మోడళ్లకు పేటెంట్ల కోసం ఇప్పటికే కంపెనీ దరఖాస్తు చేసింది. అవి NS125LA, వీనర్ X మోడల్‌లుగా లిక్ లను బట్టి తెలుస్తోంది. ఇవి 124.9cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో రానున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 8.97 హెచ్‌పి పవర్ , 9.87 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని కంపెనీ తెలిపింది.
0 Comments