త్రీడీ కళ్లద్దాలు మనలో చాలా మందికి తెలుసు. ఏదైనా త్రీడీ ను చూడటానికి థియేటర్ కు వెళ్తే వారు ఒక కళ్లజోడు మనకు ఇస్తారు. వాటిని పెట్టుకోవడం ద్వారా మనం త్రీడీ అనుభూతిని పొందగలుగుతాం. అయితే అచ్చం అలాంటి గ్లాసెస్ ను పోలి ఉండే స్మార్ట్ గ్లాసెస్ ను సరికొత్తగా టీసీఎల్ ఆవిష్కరించింది. ఇది సాధారణ గ్లాస్ కాదు, త్రీడీ గ్లాసెస్ కూడా కాదు.. అంతకుమించి అనేట్లు ఉంది. దీనిని ఇటీవల లాస్ వేగాస్ లోని కస్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో రేనియో ఎక్స్2 పేరిట టీసీఎల్ ప్రదర్శించింది. చైనాకు చెందిన టీవీల తయారీ కంపెనీ టీసీఎల్ సరికొత్త రేనియో ఎక్స్2 ను పేరిట కళ్ల అద్దాలను ఆవిష్కరించింది. ఇది థియేటర్ త్రీడీ ను తిలకించేందుకు వినయోగించే గ్లాసెస్ ను పోలి ఉంటుంది. అంతకు మించిన స్మార్ట్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ రేనియో ఎక్స్2 అద్దాలను రోజువారీ మీరు వాడే కళ్లద్దాల మాదిరిగానే వినియోగించవచ్చు. దీనిలో అత్యాధునిక సాంకేతికత ద్వారా మీకు అవసరమైన జీవీస్ నావిగేషన్, ఆటో ట్రాన్స్ లేషన్, ఫోన్ కాల్స్, మెసేజ్లను ఫోన్ నుంచి కాకుండా నేరుగా ఈ కళ్లద్దాల నుంచి చూడొచ్చు. దీనిలో మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే మీ కళ్ల ముందు వాటిని ప్రొజెక్ట్ చేస్తుంది. అలాగే ఈ స్క్రీన్ పైనే వీడియోలు కూడా చూడొచ్చు, పాటలూ వినొచ్చు. మీకు సమీపంలోని ఓ లైబ్రెరీ అడ్రస్ కావాలను కోండి.. ఏం చేస్తారు? ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసి జీపీఎస్ ఆధారంగా టార్గెటెడ్ స్పాట్ కు వెళ్లిపోతారు. కానీ ఈ కళ్లజోడు పెట్టుకుంటే మీకు ఫోన్ తో పనిలేదు. కళ్లముందు ఎల్ఈడీ స్క్రీన్ పై నావిగేషన్ కనిపిస్తుంది. ఎంచక్కా అందులో చూసుకుంటూ వెళ్లిపోవచ్చు. అలాగే ఇందులో ఉన్న మరో ఫీచర్ ఆటో ట్రాన్స్ లేషన్.. మీకు రాని వేరే భాష మాట్లాడుతున్న వ్యక్తితో మీరు సంభాషించాల్సి వస్తే ఇది అప్పటికప్పుడు అది ఆ వ్యక్తి మాటలను ట్రాన్స్ లేట్ చేసి స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేస్తుంది. టీసీఎల్ రేనియో ప్రపంచలోనే మొట్టమొదటి బైనాక్యూలర్ ఫుల్ కలర్ మైక్రో ఎల్ఈడీ ఆప్టికల్ ఏఆర్ కలిగిన స్మార్ట్ గ్లాసెస్ అని ఆ సంస్థ సీఈవో హౌయి లీ చెప్పారు. ఇది సైలిష్ గా ఉండటంతో పాటు చాలా సులభంగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఇది కళ్లకు పెట్టుకునే కొత్త ఇన్ వెన్షన్లకు నాంది పలుకుతుందన్నారు.
0 Comments