Ad Code

కిలోమీటర్‌కు 7 పైసలు ఖర్చు !


మోటోవోల్ట్ కంపెనీ నుంచి వచ్చిన అర్బన్ ఇబైక్ చూడటానికి స్టైలిష్‌గా ఉంది. స్వల్ప ప్రయాణానికి ఈ ఇబైక్ కొనుగోలు చేయొచ్చు. ధర కూడా అందుబాటులోనే ఉంది. అర్బన్ ఇబైక్ వివిధ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. పసుపు, బ్లూ, రెడ్, గ్రే వంటి కలర్లలో లభిస్తోంది. ఈ ఇబైక్ ధర రూ. 49,999 నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 54,999 వరకు ఉంది. వేరియంట్ ప్రాతిపదికన ధర కూడా మారుతుంది. దీని బరువు 40 కేజీలు. రేటెడ్ కెపాసిటీ 120 కేజీలు. ఈ అర్బన్ ఇబైక్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమటర్లు. 0 నుంచి 25 కిలోమీరట్ల వేగాన్ని 10 సెకన్లలోపే అందుకుంటుంది. ఇందులో 20 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. చార్జింగ్ టైమ్ 4 గంటలు పడుతుంది. కంపెనీ ఇందులో బీఎల్‌డీసీ మోటార్‌ను అమర్చింది. బ్యాటరీ వోల్టేజ్ కెపాసిటీ 36 వీ. సీట్ టైప్ విషయానికి వస్తే.. ఇది ఫ్లిప్ టైప్‌లో ఉంటుంది. లాక్ చేసుకోవచ్చు. టార్క్ 35 నుంచి 40 ఎన్ఎం. స్ప్రింగ్ ఆపరేటెడ్ సస్పెన్షన్ ముందు భాగంలో ఉంటుంది. వెనుక భాగంలో హైడ్రాలిక్ కోయిల్ స్ల్పింగ్ సస్పెన్షన్ ఉంటుంది. ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. వీల్స్ 20 ఇంచులు. ఒక్కసారి ఈ అర్బన్ ఇబైక్‌ను చార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అందుబాటులో ధరలో ఇబైక్ కొనాలని భావించే వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. కిలోమీటరుకు 7 పైసలు ఖర్చు వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. మూడేళ్ల వరకు బ్యాటరీపై వారంటీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 1,50,000 కిలోమీటర్లు. జెస్ట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అందువల్ల మీరు సులభంగానే ఈ అర్బన్ ఇబైక్‌ను సొంతం చేసుకోవచ్చు.


Post a Comment

0 Comments

Close Menu