వాట్సాప్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేం. ఎందుకంటే పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకూ, చిన్న చిన్ని బడ్డీ కొట్లు ల నుంచి బడా వ్యాపార సంస్థల వరకూ, ఉద్యోగులు, వ్యక్తులు, కుటుంబాలు, స్నేహితులు ఇలా ఒకటేమిటి, ఒకరేమిటి అందరి కమ్యూనికేషన్ కు ఈ వాట్సాప్ పైనే ఆధారపడుతున్నారు. వ్యక్తికీ వ్యక్తికి మధ్య పర్సనల్ చాట్ తో పాటు ఇందులోని గ్రూప్స్ సమాచార మార్పిడి బాగా ఉపకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీని వినియోగదారులు నానాటికీ పెరుగుతున్నారు. మెటా యాజమాన్యంలో నడిచే ఈ వాట్సాప్ కు మన దేశంలో కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. చాలా మంది దీనిని వాడుతారు కానీ దానిలోని చాలా ఫీచర్ల గురించి తెలీదు. కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నించరు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన ఫీచర్ ను మీకోసం అందిస్తున్నాం.. అదేంటంటే వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్. ప్రతి కాంటాక్ట్ కి, అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు వాట్సాప్ లో ఉంది. ప్రత్యేక రింగ్ టోన్ కావాలనుకుంటున్న కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయండి. వారి పేరుపై క్లిక్ చేసి లోపలికి వెళ్లండి. ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని ఎంపిక చేసుకోండి. ఐఫోన్ యూజర్లయితే ఇలా చేయండి. ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న వ్యక్తిని మీ కాన్వర్జేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, వారి పేరుపై క్లిక్ చేయండి. కింద మెనూ నుంచి వాల్‌పేపర్ & సౌండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. దాని కింద కస్టమ్ టోన్ బటన్ క్లిక్ చేసి, అలర్ట్ టోన్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన రింగ్ టోన్ ను సెట్ చేసుకోండి. మీ చాట్స్ లో నుంచి ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న గ్రూప్ ను ఎంపిక చేసుకొని, దాని పేరుపై క్లిక్ చేయండి. ఆ గ్రూప్ ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. తర్వాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని పెట్టుకోండి.
0 Comments