టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చింది. కంపెనీ 2022 డిసెంబర్ నెలలో దీన్ని ఆవిష్కరించింది. ఇది ఐదు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ ఎక్స్ ఓ అనేవి ఇవి. అలాగే ఈ కారు వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ఓ వేరియంట్లలో హైబ్రిన్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 18.3 లక్షలు. అలాగే టాప్ మోడల్ ధర రూ. 28.97 లక్షలు. కంపెనీ ఈ కార్ల డెలివరీని ప్రారంభించింది. నీలేశ్ దేశాయ్‌కు తొలి కారు డెలివరీ చేసింది. అయితే ఈ కారు వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు కనీసం ఆరు నెలలుగా ఉంది. అలాగే కొన్ని వేరియంట్లకు వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 12 నెలల దాకా ఉంది. ఈ కొత్త కారులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంది. స్మార్ట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారులో అడాస్ టెక్నాలజీ ఉంది. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. కంపెనీ ఈ ఇన్నోవా హైక్రాస్‌కు బోల్డ్ లుక్ ఇచ్చింది. చంకీ బంపర్, హనీకంబ్ మెష్ గ్రిల్, స్లీకర్ హెడ్ ల్యాంప్స్, అప్‌రైట్ ప్రొఫైల్ వంటి వాటితో ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారులో 18 ఇంచుల అలాయ్ టైర్లు ఉంటాయి. 100 ఎంఎం వీల్‌బేస్, ట్యాపంగ్ రూఫ్, అలాగే ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు మారుతీ ఎక్స్ఎల్, ఎర్టిగా టాప్ వేరియంట్లతో పోటీ పడుతోంది. అలాగే ఇన్నోవా క్రిస్టా, ఇతర 6 నుంచి 7 సీటర్ల కారుకు గట్టి పోటీ ఇస్తోంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ రెండు పవర్‌ట్రైన్స్ ఆప్షన్లలో లభిస్తోంది. ఒక దానిలో 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో సీవీటీ గేర్ బాక్స్ ఉంటుంది. పవర్ 174 పీఎస్. టార్క్ 205 ఎన్ఎం. ఇక రెండో కారులో 2 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు పవర్ 152 పీఎస్. టార్క్ 187 ఎన్ఎం. ఇందులో ఇసీవీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. కంపెనీ ప్రకారం చూస్తే.. ఈ కారు లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇంకా ఈ కారులో 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పది ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్జస్టబుల్ కెప్టెన్ సీట్స్, డ్యూయెల్ 10 ఇంచ్ రియర్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, అడాస్, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
0 Comments