'మరో భూమి'ని ధృవీకరించిన పరిశోధకులు !


41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో భూమిలా వుండే ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్‌ఎస్‌ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు అన్నారు. పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒకసారి తిరుగుతుందట. పైగా దానికి అతి సమీపంలో ఉందట. ''కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం'' అని నాసా అంటోంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org