అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు 150 డాలర్లు కన్నా తక్కువ ఆర్డర్‌లపై అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీని రద్దు చేస్తోంది. అమెజాన్ ఫ్రెష్ నుంచి తమ కిరాణా సామాగ్రిని డెలివరీ చేసే ఆర్డర్లు 150 డాలర్ల కన్నా తక్కువ చెల్లించే కస్టమర్‌లకు ఆర్డర్ సైజు ఆధారంగా 3.95 , 9.95 డాలర్లు వరకు వసూలు చేయడం జరుగుతుందని కంపెనీ ఈ-మెయిల్‌లో తెలిపింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 28 నుంచి ప్రైమ్ సభ్యులకు ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని ఆర్డర్‌లపై అనుకూలమైన రెండు గంటల డెలివరీలను అందిస్తామని కంపెనీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కస్టమర్‌లు తక్కువ రుసుముతో ఆరు గంటల డెలివరీ విండోను ఎంచుకోవచ్చునని అమెజాన్ ఈమెయిల్‌లో తెలిపింది. 2005లో ప్రారంభమైన ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా మెంబర్లు ఉన్నారు. అమెజాన్ సంవత్సరానికి 139 డాలర్లు లేదా వేగవంతమైన షిప్పింగ్, ఉచిత డెలివరీ, రిటర్న్‌ల వంటి ఇతర పెర్క్‌ల కోసం నెలకు 14.99 డాలర్లు చెల్లిస్తారు. ప్రస్తుతం, కంపెనీ 35 డాలర్లు కన్నా ఎక్కువ ఆర్డర్‌లపై సభ్యులకు ఉచిత కిరాణా డెలివరీలను అందిస్తోంది. అమెరికా అంతటా డజన్ల కొద్దీ అమెజాన్ ఫ్రెష్ స్టోర్‌లను కలిగి ఉంది. కొన్ని విదేశాలలోనూ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ 2017 నుంచి హోల్ ఫుడ్స్‌ను కూడా కలిగి ఉంది. గత కొన్ని నెలల్లో, వ్యాపారంలో లాభదాయకమైన ప్రాంతాలను తగ్గించింది. కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో నియామకాన్ని నిలిపివేసింది. ఈ నెలలో 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
0 Comments