Ad Code

ఫిలిప్స్ లో ఆరువేల మంది తొలగింపు


ఫిలిప్స్ కంపెనీ మరోసారి ఉద్యోగాల కోత ప్రకటన చేసింది. కొన్ని నెలల క్రితమే వేలాది మందినితొలగించిన సంస్థ, మరోసారి 6,000 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. గతేడాది రెస్పిరేటరీ డివైజ్‌లను భారీగా రీకాల్ చేసింది. ఆ ప్రభావం సంస్థపై తీవ్రంగా ఉంది. ఇంకా కొనసాగుతుండటమే ఉద్యోగాల కోతకు కారణమవుతున్నట్లు సమాచారం. ఈ రెస్పిరేటరీ సామగ్రిని రీకాల్ చేసిన తర్వాత ఉద్యోగుల తొలగింపు చేపట్టడం ఇది రెండోసారి. ఫిలిప్స్ సంస్థ గత ఏడాది 2022, అక్టోబర్‎లో 4,000 మందిని తొలగించింది. గతంలో మాదిరి సంస్థను మళ్లీ లాభాల్లోకి తీసుకొచ్చేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు డచ్ సంస్థ ఫిలిప్స్ తెలిపింది. ఈ రీకాల్ తో కంపెనీ మార్కెట్ విలువ 70 శాతం మేర తగ్గిపోయింది. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించాలని సంస్థ ప్రణాళికలు చేస్తోంది. 2025 నాటికి మిగిలిన 50 శాతం వర్క్ ఫోర్స్ పై నిర్ణయం తీసుకోనుంది.

Post a Comment

0 Comments

Close Menu