దేశీయ మార్కెట్లో టెక్నో మొబైల్ నుంచి ఫాంటమ్ X2 సిరీస్ కింద మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో ఫాంటమ్ ఎక్స్ 2 ప్రోగా పిలిచే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 50వేల లోపు ఉంటుంది. రిట్రాక్టబుల్ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా, స్లిమ్, లైట్ బాడీని కలిగి ఉంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల HD కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 9000 SoC, ఆండ్రాయిడ్ 12 OSపై రన్ అవుతుంది. టెక్నో కంపెనీ లాంచ్ చేసిన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. సింగిల్ 12GB RAM, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999తో (మూన్‌లైట్ సిల్వర్, స్టార్‌డస్ట్ గ్రే) రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అమెజాన్, రిటైల్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. జనవరి 24న ఈ ఫోన్ లైవ్ సేల్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు అదనంగా రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, 12 నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, 6 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందవచ్చు. టెక్నో రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొత్త టెక్నో ఫాంటమ్ X2 ప్రోను కొనుగోలు చేసే మొదటి 600 మంది కస్టమర్‌లకు ఫ్రీగా టెక్నో గిఫ్ట్ హాంపర్, నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తోంది.


Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ