సినిమాల్లో జేమ్స్‌బాండ్ ల్యాప్‌టాప్
సినిమాల్లో జేమ్స్‌బాండ్ ల్యాప్‌టాప్
ద్వారా శత్రువు ఎక్కడ ఉన్నాడో చూసి, శత్రువుకి సంబంధించిన డేటాను క్షణాల్లో సంపాదించటం పలుసార్లు చూశాము. కానీ మారిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరికీ తమ కంప్యూటర్ డేటాను
కాపాడుకోవటం అతిపెద్ద సమస్యగా మారింది. అందులోనూ
ల్యాప్‌టాప్‌ను వినియోగించేవారికి ఇది
మరీ ఎక్కువగా
ఉంది. గతంలో ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగించుకొన్న కొద్ది రోజులకే, కొత్త మోడల్ మార్కెట్‌లోకి రావటం, లేకపోతే సరికొత్త చిప్‌ను చిప్ తయారీ కంపెనీలు విడుదల చేయటం
జరిగేది. కొత్తగా వచ్చిన వాటితో తమ ల్యాప్‌టాప్‌లను
అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అనేకరకాలైన
అవాంతరాలు ఎదురు అవుతాయి.
పాతతరం ల్యాప్‌టాప్‌లతో రిపేర్ల సమస్యలు,
ల్యాప్‌టాప్‌ను
అప్‌గ్రేడ్ చేయాలన్నా ఖరీదైన వ్యవహారంగా ల్యాప్‌టాప్
పోతే, అందులోని డేటాను తిరిగి పొందటం చాలా కష్టం. మరియు . అదీగాక,
పొరపాటున
చేతిలో నుంచి జారినా, కిందపడి డ్యామేజి అయినా, అందులో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్
కరెప్ట్ అయితే, ఇంక డేటా అంతే.
మారుతున్న టెక్నాలజీ..
ట్రస్టడ్ ఫ్లాట్‌ఫామ్ మాడ్యుల్ (టిఎమ్‌పి)ను స్టాండర్డ్‌గా
కంప్యూటర్ తయారీ కంపెనీలు తీసుకొన్నాయి. దీని
ఆధారంగానే కంప్యూటర్ తయారీ కంపెనీలు ఒక అలయెన్స్‌గా ఒప్పందం ప్రకారం హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటానికి
వీలు కల్పిస్తున్నాయి. దీని వల్ల
వినియోగదారులు తమకు నచ్చిన ప్రకారం
ల్యాప్‌టాప్‌ను
మార్చుకునే సౌలభ్యం ప్రస్తుత టెక్నాలజీ వల్ల సాధ్యమౌతోంది. అంతేగాక ఈ టిఎమ్‌పి వల్ల హార్డ్‌వేర్‌కు రక్షణ ఏర్పాట్లు
కలగటమేగాక, ఇతరుల నుంచి చౌర్యం చేసినటువంటి ల్యాప్‌టాప్‌లను ఇట్టే సులభంగా
తెలుసుకోవచ్చు. అంటే...సెక్యూరిటీ అనేది
అంతర్గతంగా ల్యాప్‌టాప్‌లో పొందుపరచటం వల్ల అల్గారిథమ్స్
ఎంబీడెడ్ ఆధారంగా మైక్రోచిప్‌ను ఇందులో అమరుస్తారు. ఈ మైక్రోచిప్ ద్వారా టిఎమ్‌పి ఎన్‌క్రిప్షన్‌గా ఉండటం వల్ల
హార్డ్‌డిస్క్‌లో ఉన్నటువంటి డేటాకు రక్షణగా
నిలుస్తుంది.
ఈ టిపిఎమ్ సిస్టమ్ ఆధారంగా ఏ ల్యాప్‌టాప్ నెట్‌వర్క్ సిస్టమ్స్ పని చేస్తాయో, ఆ
నెట్‌వర్క్‌లోకి మీరు అక్రమంగా ప్రవేశించాలని
ప్రయత్నిస్తే,
అది దుర్లభం. అంతేగాక అందులోకి మీరు
యూజర్ నేమ్,
పాస్‌వర్డ్‌ను తప్పకుండా ఎంటర్ చేయాలి. సరైన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయకపోతే మీరు
ప్రవేశించటం అడ్డుకోవటమే గాక, మీరు అక్రమంగా నెట్‌వర్క్‌లోకి
చొరబడుతున్నారని సర్వర్‌ని అలర్ట్ చేస్తుంది. పదేపదే మీరు
అక్రమంగా ప్రవేశించటానికి ప్రయత్నిస్తే మీ సిస్టమ్‌ను హ్యాంగ్
చేయగల సత్తా ఈ టెక్నాలజీకి ఉంది. ఇందులోనూ అప్‌గ్రేడ్ టెక్నాలజీ
సైతం వచ్చింది. దీని సాయంతో మీరు సిస్టమ్‌కు ఫింగర్ ప్రింట్, లేకపోతే
బయో మెట్రిక్ ఆధారిత టెక్నాలజీని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇతరులు ఎవ్వరూ అక్రమంగా డేటాను చోరీ చేయలేరు.