యూట్యూబ్ షార్ట్స్‌లో కొత్త ఏఐ ఫీచర్ యాడ్ ఆబ్జెక్ట్ టూల్ !


యూట్యూబ్ షార్ట్స్‌లో కొత్త ఏఐ ఫీచర్ యాడ్ ఆబ్జెక్ట్ టూల్. ఈ టూల్ ద్వారా క్రియేటర్లు ఇతరుల షార్ట్ వీడియోల నుంచి తీసుకున్న సీన్‌లో (8 సెకన్ల వరకు) ఏఐ రూపొందించిన అంశాలను (ఆబ్జెక్ట్‌లు, ప్రాప్స్ లేదా ఎఫెక్ట్‌లు) జోడించవచ్చు. వినియోగదారులు సూచించిన ప్రాంప్ట్‌లను ఎంచుకోవచ్చు లేదా స్వయంగా కస్టమ్ ప్రాంప్ట్ టైప్ చేస్తే సరిపోతుంది. ఏఐ మిగతా పనిని స్వయంగా పూర్తి చేస్తుంది. దీంతో సంక్లిష్టమైన ఎడిటింగ్ అవసరం తగ్గుతుంది. రీ ఇమాజిన్ టూల్ మరింత ప్రత్యేకమైనది. ఇది ఒక షార్ట్ వీడియోలోని ఒకే ఫ్రేమ్‌ను తీసుకుని, దాన్ని పూర్తిగా కొత్త ఏఐ జనరేటెడ్ వీడియోగా మారుస్తుంది. వినియోగదారులు ప్రాంప్ట్‌లతో పాటు గరిష్టంగా రెండు రిఫరెన్స్ ఫొటోలను అప్‌లోడ్ చేయొచ్చు. యూట్యూబ్ ఏఐ రీమిక్స్‌పై ట్రాన్స్​పరెన్సీకి ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి ఏఐ రీమిక్స్ యాడ్ ఆబ్జెక్ట్ లేదా రీఇమాజిన్ ద్వారా సృష్టించినది. అసలు షార్ట్ వీడియోకు ఆటోమెటిక్‌గా లింక్ అవుతుంది. దీంతో ఒరిజినల్​ క్రియేటర్‌కు తగిన క్రెడిట్ లభిస్తుంది. తమ వీడియోలను ఇతరులు ఏఐ రీమిక్స్‌లో ఉపయోగించకూడదనుకునే క్రియేటర్లు సెట్టింగ్స్‌లో ఆ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకునే వీలుంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org