బెంగళూరు బాగలకుంటే ఎంఈఐ లేఔట్ కు చెందిన విద్యాజ్యోతి బాష్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. తాను ప్రేమించిన యువకుడిని తొమ్మిది రోజుల క్రితం పెద్దల అంగీకారంతో పెండ్లాడింది. విద్యాజ్యోతి జాతకాన్ని చూసిన ఓ జ్యోతిష్యుడు "నీకు ఆయుష్షు తక్కువ, త్వరలోనే నీ నూకలు చెల్లుతాయి" అంటూ ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశాడు. ఆ గండం నుంచి బయటపడాలంటే తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని, చివరి రోజైన శుక్రవారం మెడలోని తాళిని తీసి అమ్మవారికి సమర్పించాలని సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడి మాటలతో విపరీతంగా భయపడిపోయిన ఆమె, ఆయన చెప్పినట్టే ఎనిమిది రోజులు పూజలు చేసింది. తొమ్మిదో రోజున తాళిని తీసి అమ్మవారికి ఇచ్చే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఓ మంచి హోదాలో ఉన్న యువతి, మూఢనమ్మకాలను నమ్మి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు జ్యోతిష్యుడి వివరాలు సేకరిస్తున్నారు.
మూఢనమ్మకాలకు బలైన యువతి !
by Telugu Lo Computer at March 01, 2026
Labels:
a resident of MEI Layout
,
A young woman who fell victim to superstitions
,
bangalore
,
karnataka
,
Vidya Jyoti
,
works as a software engineer in Bosch.
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment