Ad Code

హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్


వర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'నటించిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు  హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. కేవీబీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్, బీమ్లా నాయక్ తర్వాత మరోసారి ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu