Ad Code

ప్రియుడితో కలిసి పరారయ్యేందు ప్రయత్నించి భర్తకు చిక్కిన మహిళా కానిస్టేబుల్ !


బీహార్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పాట్నా రైల్వే స్టేషన్ కు వచ్చింది. తన భార్య మరో వ్యక్తితో పరార్ అవుతున్న విషయం తెలిసి వెంటనే రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. భార్య ఆమె ప్రియుడిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోతూ తన భార్య ప్రియుడిపై విరుచుకుపడ్డాడు. భార్య ముందే ప్రియుడిపై పిడిగుద్దులు కురిపించాడు. తన భర్త నుంచి ప్రియుడిని విడిపించుకునేందుకు ఆ మహిళా కానిస్టేబుల్ విశ్వ ప్రయత్నం చేసింది. అయినా ఆమె ప్రియుడిని విడిచిపెట్టకుండా దాడికి దిగాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నం చేసినా వదల్లేదు. అతని దెబ్బలు తాళలేకపోయిన ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది. ఇక దాడి అనంతరం సీఆర్పీఎఫ్ భర్త తన భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె మాత్రం వెళ్లలేదు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్పీఎఫ్ భర్తను కాదని ప్రియుడితో పారపోయేందుకు రెడీ అయిన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్లేవారికి బుద్ది చెప్పాల్సిన మహిళా కానిస్టేబుల్ ఇలా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu