అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు మూడు నెలల పాటు పొడిగింపు!


ఆంధ్రప్రదేశ్ లో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో మూడు నెలలపాటు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఈ నెల 23తో గడువు ముగిసింది. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జనవరి 23 వరకూ లే అవుట్లు, ప్లాట్‌లు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం కింద 2025 జూన్ 30కి ముందు వేసిన లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ గడువు పొడిగింపు వల్ల మరింత మంది అనధికార లే అవుట్ యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పురపాలక, నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అనధికార లే అవుట్లు ఈ పథకం కిందకు వస్తాయి. 

No comments:

Post a Comment

3