న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ మరియు రాజస్థాన్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరితో సహా మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు 1951, 2004 మధ్య ఎనిమిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ నిర్వహించారు. రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితాల నాణ్యత సమస్యను లేవనెత్తాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు ప్రతి ఓటరు ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శించి కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడానికి, ఏవైనా తప్పులను సరిదిద్దుతారని జ్ఞానేష్ కుమార్ అన్నారు. జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫారం-6, డిక్లరేషన్ ఫారాలను సేకరించి, కొత్త ఓటర్లు ఫారాలను నింపడానికి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఈఆర్ఓకి అందజేస్తారు అని అన్నారు. రెండవ దశ శిక్షణ మంగళవారం ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు రాబోయే రెండు రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశమై SIR ప్రక్రియపై వారికి వివరించాలని ఆయన ఆదేశించారు. ఏ పోలింగ్ స్టేషన్‌లోనూ 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు.
0 Comments