సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముకల్లో తీవ్ర గాయం కాగా అంతర్గతంగా రక్తస్రావం కావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ శ్రేయస్ అయ్యర్ ను వెంటనే ఐసీయూకి తరలించింది. కనీసం వారం రోజుల పాటు శ్రేయస్ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారు. బ్లీడింగ్ ఆగిపోయి, ఇన్ఫెక్షన్ కాకుంటే షిఫ్ట్ చేస్తామని మేనేజ్‌మెంట్కు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు ఆటకు శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది. మూడో వన్డేలో వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకొనే క్రమంలో శ్రేయస్ కిందపడ్డాడు. దాంతో అతడు బలంగా నేలను తాకాడు. ఆ సమయంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన శ్రేయస్‌ను బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. పరీక్షల్లో అతడికి అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు తేలింది. దాంతో అతడిని ఐసీయూలో చేర్చారు. కనీసం నాలుగు నుంచి ఏడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ లేకుంటే శ్రేయస్ డిశ్చార్జ్ అవ్వనున్నాడు. ప్రస్తుతం శ్రేయస్ పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని సమాచారం.
క్యాచ్ అందుకొనే క్రమంలో కిందపడ్డ శ్రేయస్ అయ్యర్ : అబ్జర్వేషన్‌లో ఉంచాలన్న వైద్యులు
by Telugu Lo Computer at October 27, 2025
Labels:
at least a week
,
cricket
,
Doctors to keep him under observation
,
national
,
Shreyas Iyer falls while taking a catch
,
sports
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment