నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ !


తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ లో సమాచారం అందిస్తారు. తుది జాబితాను డీఈవోలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో వెరిఫికెషన్ హాజరవ్వాలని అధికారులు సూచించారు. తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల విడుదలలో జాప్యం జరగడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫలితాలను విడుదలయ్యాయి. తెలంగాణ మెగా డిఎస్సీ 2024లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796పోస్టులు ఉన్నాయి. 2017 తర్వాత తెలంగాణలో డిఎస్సీ నియామకాలను 2024లోనే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 కేంద్రాల్లో డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org