నటుడు గోవిందా మోకాలికి బుల్లెట్ గాయం !

                                                 

టుడు, శివసేన నాయకుడు గోవిందాకు ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయి మోకాలికి బుల్లెట్ తగిలింది. దీంతో హుటాహుటిన గోవిందను ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. నటుడు గోవింద తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనేజర్‌ తెలిపారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం నటుడు గోవిందా మంగళవారం తెల్లవారుజామున 4:45 గంటలకు ఆయన ఇంటి నుంచి కోల్‌కతాకు బయలుదేరే ముందు తన తుపాకీని తనిఖీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ తన మోకాలికి తగిలిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కాగా తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు. 
Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org