ఈపీఎఫ్ఓ సభ్యులు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పధకం ప్రయోజనాలు క్లైమ్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ కార్డు అనుసంధానం, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ తప్పనిసరి. ఈఎల్ఐ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రారంభించింది. అయితే బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ అనుసంధానం, యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఈ పధకం లబ్ది అందకపోవచ్చు. అందుకే తప్పనిసరిగా ఈ రెండింటి ప్రక్రియ పూర్తి కావల్సి ఉంది. ఉద్యోగులంతా తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చేయించుకోవాలి. ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు యూనివర్శల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుండాలి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లో లింక్ అయుండాలి. అప్పుడే మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అవుతుంది. యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ కావడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్, పీఎఫ్ ఆన్‌లైన్ విత్‌డ్రాయల్, అడ్వాన్స్ బదిలీ, వ్యక్తిగత సమాచారం అప్‌డేట్ చేయడం, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేయడం వంటి సేవలు లభిస్తాయి. యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ కూడా చాలా సులభం. ఆధార్ ఆధారిత ఓటీపీతో అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్‌లో మూడు రకాలుంటాయి. ఇందులో ఎ అనేది మొదటిసారి ఈపీఎఫ్ పథకంలో చేరిన ఉద్యోగికి వర్తిస్తుంది. బి అనేది తయారీ రంగంలో ఉద్యోగ కల్పనకు సంబంధించింది. ఇక సి అంటే ఉద్యోగులకు సహకారమిచ్చేది. తయారీ రంగంలో అదనపు ఉద్యోగాల కల్పనకు స్కీమ్ బి అనేది ప్రోత్సహిస్తుంది. అటు ఉద్యోగి ఇటు యజమాని ఇరువురికీ నిర్ణీత పరిమాణంలో లాభం కలుగుతుంది. ప్రభుత్వం యాజమాన్యాలకు నెలకు 3 వేలు రీయింబర్స్ చేస్తుంది. వాస్తవానికి యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ చివరి తేదీ నవంబర్ 30 ఉండేది. కానీ పీఎఫ్ సభ్యుల ప్రయోజనార్ధం జనవరి 15 వరకూ గడువు పొడిగించారు. అధిక పెన్షన్‌కు సంబంధించి 3 లక్షల 10 వేల పెండింగ్ దరఖాస్తులకు లాభం కలగనుంది.
యూఏఎన్ యాక్టివేషన్ గడువు జనవరి 15 వరకు పొడిగింపు !
by Telugu Lo Computer at December 27, 2024
Labels:
3 లక్షల 10 వేల పెండింగ్ దరఖాస్తులకు లాభం
,
national
,
అధిక పెన్షన్‌కు సంబంధించి
,
యూఏఎన్ యాక్టివేషన్ గడువు జనవరి 15 వరకు పొడగింపు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment