ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో బైక్పై వెళ్తున్న ఓ మహిళపై అల్లరిమూక వేధింపులకు తెగబడింది. భారీ వర్షాల కారణంగా వరద నీటితో నిండిన రోడ్డుపై బైక్పై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ మహిళ స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీటిలోంచి ఒక వ్యక్తితో కలిసి బైక్పై వెనుక కూర్చొని వెళ్తోంది. అప్పటికే నీళ్లలో దిగి వెకిలి చేష్టలు చేస్తున్న దాదాపు 15 మంది యువకులు మహిళను చూసి వర్షపు నీళ్లు చల్లడం మొదలు పెట్టారు. ఆమెను వేధిస్తూ వికృతానందం పొందారు. అనంతరం ఆమెను ఒక్కసారిగా నీటిలోకి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టారు. అనంతరం ఆ మహిళను అక్కడి నుంచి పంపించేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మహిళపై పోకిరీల అసభ్యకర ప్రవర్తన - వీడియో వైరల్
by Telugu Lo Computer at August 01, 2024
Labels:
national
,
Uttar Pradesh
,
దాదాపు 15 మంది యువకులు
,
మహిళపై పోకిరీల అసభ్యకర ప్రవర్తన
,
వరద నీటితో నిండిన రోడ్డుపై బైక్పై వెళ్తున్న ఓ మహిళ పట్ల
,
వీడియో వైరల్
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment