తేలు, పాము కాటు - ప్రథమ చికిత్స !


వానా కాలంలో పాములు, తేళ్ల భయం పొంచి ఉంటుంది. పాము, తేలు కరిచిన వెంటనే ఆందోళన చందకుండా సరైన సమయంలో చికిత్స పొందితే ముప్పు నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. తేలు కరిచినప్పుడు భయపడకుండా వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది. తేలు కొట్టడం వల్ల చాలా నొప్పిగాను, మంటగాను ఉంటుంది. కాటు వేసిన చోట ఐస్ ను రాయాలి. ఇన్ఫెక్షన్ రాకుండా కుట్టిన ప్రదేశాన్ని సబ్బు వేసి గోరు వెచ్చని నీటితో కడగాలి. వేప నూనెలో పసుపు కలిపి యాంటీసెప్టిక్ గా పూయడం మంచిది. తేలు కరిచిన చోటకు కాస్త పైన అంటే విషయం శరీరం అంతా వ్యాపించకుండా గుడ్డతో గట్టిగా కట్టుకుంటే విషం శరీరంలోకి చేరే అవకాశాలు తగ్గుతాయి. తేలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో మిరియాల పొడి చల్లితే విష ప్రభావం తక్కువగా ఉంటుంది. అనంతరం వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అదే పాము కాటు వేస్తే శరీరంలో పాము కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేర కదిలించకుండా ఉంచాలి. శరీరం పై నగలు, గడియారాలను తొలగించాలి. దుస్తులను వదులు చెయ్యాలి. పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగుకూడదు. ఆ ప్రాంతాన్ని కోసి రక్తస్రావమయ్యేలా చెయ్యకూడదు. విషం శరీరంలోకి వ్యాపించేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఆ లోపు కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని చిరంజీని తీసుకుని ఆ గాట్లలో ఓ చోట పెట్టి రక్తాన్ని అందులోకి లాగాలి. ఇలా చేసినప్పుడు మొదట వచ్చే రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు చేసిన తరువాత డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.

No comments:

Post a Comment

3