వాట్సాప్ తాజాగా ఒక కొత్త ట్రిక్, అప్‌డేటెడ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. మన కాంటాక్ట్‌లో లేని వ్యక్తికి సైతం సులభంగా మెసేజ్ చేసే ట్రిక్‌ను పరిచయం చేసింది. ఈ ట్రిక్‌ను ఉపయోగించి అవతలి వ్యక్తి కాంటాక్ట్‌ను సేవ్ చేసుకోకుండానే మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఈ ట్రిక్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు డివైజ్‌లలోనూ పని చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లో వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి, మీరు మెసేజ్ పంపించాలనుకుంటున్న అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌ను కాపీ చేయండి. న్యూ చాట్' బటన్‌పై క్లిక్ చేసి మీ కాంటాక్ట్ నంబర్ ఓపెన్ చేసి చాట్ విండో తెరవండి. కాపీ చేసిన కాంటాక్ట్ నంబర్‌ను చాట్ బాక్స్‌లో పేస్ట్ చేసి సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి. చాట్‌లోని నంబర్‌పై క్లిక్ చేయండి. అవతలి వ్యక్తికి వాట్సాప్ ఉన్నట్లయితే, చాట్ విండో ఓపెన్ అవుతుంది. అనంతరం మీ చాట్‌ను కొనసాగించవచ్చు.
0 Comments