ఆనంద్ మహీంద్రా మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీటిపై తేలియాడే ఇంటిని చూడవచ్చు. దీనిని మొత్తం నేచురల్ మెటీరియల్స్ ఉపయోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. వర్షాలు పడినప్పుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని ప్రశాంత్ కుమార్ అనే ఇంజినీర్ అలోచించి ఇలాంటి ఓ అద్భుతమైన నిర్మాణం రూపొందించారు. ఇలాంటి ఇల్లు డిజైన్ చేయాలని 2020లోనే అనుకున్నట్లు, ఆ తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసినట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ ఇంటికి కరెంట్ కోసం సోలార్ ప్యానెల్స్ కూడా సెట్ చేశాడు. ఈ వీడియో షేర్ చేస్తూ వాతావరణ మార్పుల వల్ల జీవితాల్లో ఏర్పడే అంతరాయాలను పరిష్కరించడానికి ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇలాంటి ఆవిష్కరణలు కనిపిస్తాయి. దీనికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రశాంత్‌ను సంప్రదిస్తాను, నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలనో చూస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు.
0 Comments