చెరువులు, జలాశయాలు, నదులలో లభించే ఈ మంచినీటి చేప కొరమీనుకు మిగతా చేపల కంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని ధర కూడా మిగతా వాటి కంటే ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాములు కొరమీను చేప మాంసంలో 16.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 140 మిల్లీగ్రాముల క్యాల్షియం, 0.5 మిల్లీగ్రాముల ఐరన్, 1080 ఎం సి జి జింక్, 94 క్యాలరీలు ఉంటాయి. కొరమీను చేపలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కొరమీను చేపలు తినడం వల్ల మన బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల మన బరువు నియంత్రణలో ఉంటుంది. కొరమీను చేపలు ఉండే గ్లైసిన్, అరాకిడోనిక్ యాసిడ్ మన శరీరం పైన ఏర్పడిన గాయాలను మాన్పడానికి ఎంతగానో ఉపయోగపడతాయి గాయాలతో ఉన్నవారు కొరమీను చేపను తింటే త్వరగా గాయాలు మానుతాయి. చేపల చర్మం లో ఉండే సెరిటోనెర్జిక్ పదార్థాలు మన మానసిక ఒత్తిడిని తగ్గించి యాంటీ డిప్రెజెంట్ గా పనిచేస్తాయి. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన పోషక విలువలు కోరమీను చేపలలో ఉంటాయి. కొరమీను చేపలను తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. చర్మ సంబంధిత తామర వ్యాధికి కోరమీనుతో చికిత్స చేస్తారు. కొరమీను చేపలు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శరీరంలో నొప్పులు, వాపులు, మంటలు తగ్గించే అద్భుతమైన గుణాలు కొరమీనులో ఉన్నాయి.
0 Comments