Ad Code

జీమెయిల్​లో స్మార్ట్ రిప్లై ఫీచర్ ?


జీమెయిల్ లో స్మార్ట్ రిప్లై అనే కొత్త ఫీచర్ ను గూగుల్ తీసుకొచ్చింది. దీని ద్వారా మనం సందర్భోచితంగా ఎవరికైనా రిప్లైస్ ఇవ్వొచ్చు. మనం రిప్లైలు ఇచ్చే క్రమంలో జీమెయిల్ స్మార్ట్ రిప్లై ఫీచర్ కొన్ని సూచనలు చేస్తుంది. ఏఐ టెక్నాలజీని వాడుకొని ఈ సూచనలు జనరేట్ అవుతాయి. మనకు వచ్చిన ఈమెయిల్‌లోని టెక్ట్స్, వర్డ్స్ ఆధారంగా ఈ సూచనలను ఏఐ టెక్నాలజీ జనరేట్ చేస్తుంది. ఈ సజెషన్లను వాడుకొని మనం రిప్లైలను ఈజీగా పంపేయొచ్చు. మనకు నచ్చని సజెషన్లను వదిలేసి, నచ్చిన వాటినే రిప్లైగా పంపొచ్చు. ఈ రిప్లైలు అర్థవంతంగా, స్మార్ట్‌గా ఉంటాయి. మనకు వచ్చిన సజెషన్లను ఎంపిక చేసుకొని వాటిని ఎడిట్ చేసి అవసరాలకు అనుగుణంగా మార్చుకొని రిప్లైను పంపొచ్చు. వాస్తవానికి 2017 సంవత్సరంలోనే ఈ ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఫీచర్‌కు ఏఐ టెక్నాలజీని జోడించింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు సపోర్ట్ చేస్తూ ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రస్తుతానికి గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియంతో పాటు కొంతమంది యూజర్లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. విడతల వారీగా తమ యూజర్లు అందరికీ ఈ ఫీచర్‌ను అందిస్తామని గూగుల్ అంటోంది.

Post a Comment

0 Comments

Close Menu