Ad Code

మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ?


మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌, క్రోమియం-బేస్డ్ ఎడ్జ్ బ్రౌజర్‌లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇటీవల గుర్తించింది. ఈ సమస్యల తీవ్రత మధ్యస్థ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అయినా సరే ఎడ్జ్ బ్రౌజర్ వాడే యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యలను ఉపయోగించుకోని హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్‌లోకి చొరబడి, వారి సెన్సిటివ్ డేటాను దొంగలించవచ్చు. దీని వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువ. కీలకమైన సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్తే బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ అయిపోతాయి. 129.0.2792.52 కంటే ఓల్డ్ క్రోమియం-బేస్డ్ ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వారికి సెక్యూరిటీ రిస్క్స్ ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్  వెల్లడించింది. బ్రౌజర్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆటోఫిల్ ఫీచర్ (పాస్‌వర్డ్‌లు, అడ్రస్‌ల వంటి సమాచారాన్ని ఆటోమేటిక్‌గా నింపే ఫీచర్‌).. V8 ఇంజన్ (బ్రౌజర్‌ను రన్‌ చేసే మెయిన్ ఇంజన్‌) సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెబ్‌సైట్‌ల అడ్రస్‌లు రాసే ఓమ్నిబాక్స్‌లో సరిగా చెకింగ్ జరగకపోవడం వల్ల కూడా సెక్యూరిటీ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. ఈ బ్రౌజర్ ఇప్పుడు ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సరిగా నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు. వెబ్ పేజీలను క్రియేట్ చేసేటప్పుడు ఇన్‌పుట్‌ను సరిగా మేనేజ్ చేయలేకపోతోంది. హ్యాకర్లు ఈ సమస్యలను ఉపయోగించి యూజర్లను వివిధ రకాలుగా మోసగించవచ్చు. హ్యాకర్లు యూజర్లను ఒక హానికరమైన వెబ్‌సైట్‌కి వెళ్లేలా మోసగించవచ్చు. ఈ వెబ్‌సైట్‌కి వెళ్లిన క్షణంలోనే యూజర్ మొబైల్ ఫోన్లు/ కంప్యూటర్లలోకి వైరస్‌లు వచ్చే అవకాశం ఉంది. అలానే బాగా తెలిసిన వెబ్‌సైట్‌ను బ్యాడ్ వెబ్‌సైట్‌లా మార్చవచ్చు. ఉదాహరణకు, బ్యాంక్ వెబ్‌సైట్‌ URL టైప్ చేసి ఎంటర్ చేశాక ఫేక్ వెబ్‌సైట్ ఓపెన్ కావచ్చు. అది పాస్‌వర్డ్స్‌, ఇతర సమాచారాన్ని దొంగలించవచ్చు. హ్యాకర్లు కంప్యూటర్ మెమరీలోని లోపాలను ఉపయోగించి కంప్యూటర్‌ను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. అలానే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ లేదా సోషల్ మీడియా మెసేజ్‌లలోని లింక్స్‌ను క్లిక్ చేయవద్దు. క్రోమియం-బేస్డ్ ఎడ్జ్ బ్రౌజర్ 129.0.2792.52 వెర్షన్‌ కంటే ఓల్డ్ వెర్షన్‌ వాడేవారు వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లైతే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి "మైక్రోసాఫ్ట్ ఎడ్జ్" అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కనిపించాక దానిపై క్లిక్ చేస్తే "అప్‌డేట్" అని కనిపిస్తుంది. తద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. విండోస్ పీసీలో సెట్టింగ్స్ ఫాలో అవుతూ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని అప్‌డేట్ చేసుకోవచ్చు. ముందు టాప్-రైట్ కార్నర్‌లో ఉన్న 3-డాట్స్ మెనూకి వెళ్లి "హెల్ప్ అండ్ ఫీడ్‌బ్యాక్" క్లిక్ చేయాలి. ఇక్కడ "అబౌట్‌ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్" ట్యాప్ చేస్తే బ్రౌజర్ న్యూ వెర్షన్ కోసం చెక్ చేస్తుంది. లేటెస్ట్ వెర్షన్‌ కనిపించగానే "అప్‌డేట్" బటన్ డిస్‌ప్లే అవుతుంది. దానిపైన క్లిక్ చేసి లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత బ్రౌజర్‌ను రీలాంచ్ చేయాలి.

Post a Comment

0 Comments

Close Menu