నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన 20 ఏళ్ల యువతి వీడియో !
20 ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు దండలు మార్చుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పలుమార్లు ఒకరి మెడలో మరొకరు పూలమాలలు మార్చుకుంటున్నారు. ఇందులో యువతి ఎంతో ఆనందంగా ఉండటం చూస్తుంటే ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు కనిపిస్తుంది. వరుడు ఎదురుగా నిలబడి సిగ్గుల మొగ్గ అవుతుంది వధువు. వెనుక కుటుంబ సభ్యులు పూలు జల్లి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సోదరా, ఇది కలియుగం, ఏదైనా జరగొచ్చు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు. గుర్రాలకు గడ్డి దొరకడం లేదంటే.. గాడిదలు చ్యవనప్రాస్ తింటున్నాయి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఆ వృద్ధుడు తన ఆస్తినంతా కట్నంగా ఇచ్చాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది ఫేమ్ అయ్యేందుకు ఇటువంటి వీడియోలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్క రోజులో సెలబ్రిటీలు అయిపోవాలన్న ఉద్దేశంతో రీల్స్, షాట్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఓ వైపు ఇటువంటి సందేహం కలుగకమానదు. అమ్మాయి చేతికి గాజులు లేకపోవడంతో పాటు.. ఏదో స్కిట్‌లా కనిపిస్తుంది కూడా. వెనుక చిన్న పిల్లలు అక్షింతలు వేస్తుండటం చూస్తుంటే ఇది రియల్ వివాహమా, రీల్ వివాహమా అన్న అనుమానం వస్తుంది.