Ad Code

హర్యానాలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల !


ర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా యత్నిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేలా పలు హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతుల సంక్షేమం, అమరవీరుల కుటుంబాలను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ హుడా, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇటీవల ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్‌.. పలు హామీలతో మరో మేనిఫెస్టోను రూపొందించింది. రైతుల సంక్షేమం కోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు రూ. 2 కోట్లను ప్రకటించింది. మూడు సాగు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో అమరులైన రైతులకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయడంతో పాటు 736 మంది రైతులకు అమరవీరుల హోదా ఇస్తామని తెలిపింది. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రైతుల అభివృద్ధి కోసం సబ్సిడీపై డీజిల్‌ అందిస్తామని, అందుకోసం డీజిల్‌ కార్డులను జారీ చేస్తామని పేర్కొంది. పరువు హత్యలు, ఇతర నేరాలను నివారించేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తామని.. హరియాణాను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అందుకోసం డీ-అడిక్షన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగాల కోసం భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'హర్యానా కుశాల్‌ రోజ్‌గార్‌ నిగమ్‌'ను రద్దు చేస్తామని పేర్కొంది. పేపర్‌ లీక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu