ఉల్లిపాయలు ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందించినప్పటికీ, ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అజీర్ణం, రక్తపోటు, షుగర్ లెవల్స్ పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఉల్లిపాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. దీనిలో సల్ఫర్ సాంద్రత అధికంగా ఉండటం వల్ల శరీరంలోకి దీన్ని ఎక్కువగా తీసుకుంటే నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతుంది. శరీరంలోని రసాయనాలు విడుదల కావడం వల్ల చెమట ద్వారా కూడా అసహ్యమైన వాసన వచ్చే అవకాశం ఉంది. ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై ర్యాషెస్, గుండ్రటి దద్దుర్లు, కళ్లల్లో దురద, నీళ్లు కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఉల్లిపాయలు రక్తనాళాలలో రక్తం పలుచగా మారేలా చేయవచ్చు. రక్తపోటు, రక్త స్రావం సమస్యలున్నవారు ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం ముదురవచ్చు. దీనిలో ఫ్రుక్టాన్స్ అనే పదార్థం ఉండటం వల్ల అది కడుపులో జీర్ణక్రియ సమస్యలను కలిగించవచ్చు. ఎక్కువగా తింటే కడుపులో వాయువు, పిండి మరియు పేగుల్లో సమస్యలు తలెత్తుతాయి. ఉల్లిపాయలు బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. షుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఉల్లిపాయలు తీసుకుంటే హైపోగ్లైసీమియా సమస్య తలెత్తవచ్చు. ఉల్లిపాయలు రక్తపోటును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటాయి. దీని వలన బీపీ మందులు తీసుకుంటున్నవారు ఉల్లిపాయలు అధికంగా తీసుకుంటే రక్తపోటు మరీ తక్కువగా పడే ప్రమాదం ఉంది. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల కడుపులో వాయువు పేరుకుపోవడం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది పేగుల్లో సమస్యలు కలిగిస్తుంది. కొన్ని మంది చాలా సెన్సిటివ్‌గా ఉండి, ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు, డయేరియా వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.
ఉల్లిపాయలు ఎక్కువగా తింటే వచ్చే అనర్ధాలు !
by Telugu Lo Computer at September 30, 2024
Labels:
arogyam
,
food
,
Health Tips
,
అజీర్ణం
,
ఉల్లిపాయలు ఎక్కువగా తింటే వచ్చే అనర్ధాలు
,
నోటి దుర్వాసన సమస్య ఏర్పడుతుంది
,
రక్తపోటు
,
షుగర్ లెవల్స్ పెరగడం వంటి సమస్యలు
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment