ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని డెల్ ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది. మెమో ప్రకారం సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్‌లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.
0 Comments