కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా ఒక వ్యక్తి కలకలం సృష్టించాడు. రాహుల్ గాంధీ వాహనం పక్కగా బైక్పై వెళ్లాడు. వృద్ధుడైన ఆ వ్యక్తి చేతిలో పొడవైన కర్ర కూడా ఉన్నది. కాంగ్రెస్ కీలక నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు పక్కగా బైక్ వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించడంపై విమర్శలు వచ్చాయి.
రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన : కాన్వాయ్ పక్కగా కర్ర పట్టుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి !
by Telugu Lo Computer at September 30, 2024
Labels:
national
,
కాన్వాయ్ పక్కగా కర్ర పట్టుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి
,
రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన
,
వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
,
హర్యానాలో ఈ సంఘటన జరిగింది
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment