బీహార్‌లో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ వరదలకు కోసి, బాగమతి సహా ఆ రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేకలు, అరుపులతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, కోసి డ్యామ్ నీటిమట్టం బాగా పెరిగింది. దీంతో ఆ నది ఉప్పొంగడంతో అక్కడున్న వంతెనను నీటి ప్రవాహం తాకుతున్నది. ఇది చూసి ఆ బ్రిడ్జిపై ఉన్న జనం భయాందోళన చెందారు. అరుస్తూ వంతెన పైనుంచి పరుగెత్తారు. దీంతో పోలీసులు స్పందించారు. మహిళలు, పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు వ్యక్తులు ఫొటోలు తీయడంలో బిజీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కోసి డ్యామ్ నీటిమట్టం పెరగడం వల్ల నది ఉప్పొంగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో నదుల చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దన్న ప్రభుత్వం హెచ్చరికలను ప్రజలు పాటించాలని కోరారు. ప్రజలు తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
0 Comments