Ad Code

తాజా ప్రజాభిప్రాయ సర్వేల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ మీద కమల కమలా పైచేయి !


మెరికాలో మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా వంటి కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కన్నా పాలక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఎక్కువ మద్దతు లభిస్తోందని వివిధ ప్రజాభిప్రాయ సర్వేలు తెలిపాయి. నవంబరు 5న జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి హారిస్, ట్రంప్‌ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం జాతీయ స్థాయిలో కమలా హారిస్‌కు ట్రంప్‌ మీద 2 శాతం ఆధిక్యత కనిపిస్తోంది. ఈ సైట్‌ వివిధ సర్వేలను క్రోడీకరించి పై విషయం తెలిపింది. యూగవ్‌-యుమాస్‌ లోవెల్స్‌ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఒపీనియన్‌ సంస్థల సంయుక్త సర్వే ప్రకారం మిషిగన్‌ రాష్ట్రంలో కమలా హారిస్‌కు 48 శాతం, ట్రంప్‌నకు 43 శాతం మద్దతు వ్యక్తమవుతోంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో కమలకు 48 శాతం, ట్రంప్‌నకు 46 శాతం ఓటర్ల మద్దతు లభిస్తోంది. ఫాక్స్‌ న్యూస్‌ ప్రకారం జార్జియా రాష్ట్రంలో కమలకు 51 శాతం, ట్రంప్‌నకు 48 శాతం మద్దతు వ్యక్తమవుతోంది. అరిజోనా రాష్ట్రంలో ఈ లెక్కలు తారుమారయ్యాయి. అక్కడ ట్రంప్‌ 51 శాతం, కమల 48 శాతం ఆదరణ చూరగొంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu