ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు (ఎస్ఎంసీ) శిక్షణ పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగు కోసం ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్ బ్యాక్ కోసం రూపొందించిన యాప్‌లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని తెలిపారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రతి పాఠశాలకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను వెంటనే సమకూర్చాలన్నారు. విద్యాకానుకకు సంబంధించి బాలురు, బాలికలకు ఒకేరకమైన ప్యాట్రన్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం రూ.వేలకోట్లు ఖర్చుచేస్తున్నా హాజరుశాతం కేవలం 70శాతం మాత్రమే ఉండటానికి గల కారణాలను అన్వేషించాలని, హాజరుశాతం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్యాగులు, షూస్, డిక్షనరీల నాణ్యతపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్రశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి !
by Telugu Lo Computer at September 30, 2024
Labels:
కెపాసిటీ బిల్డింగ్ చేయాలని
,
ప్రధానోపాధ్యాయులు
,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి
,
మంత్రి నారా లోకేశ్
,
సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment