మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కూల్చివేతలపై మాట్లాడుతూ.. ''స్లమ్‌ల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను. జలవిహార్, ఐమాక్స్‌లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించి ఖాళీ చేయించాల్సింది. ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇళ్లకు రెడ్‌మార్క్ వేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పించడం మంచిది. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాను'' అని దానం నాగేందర్ అన్నారు.
0 Comments